ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యంపై జగన్ సర్కారు న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి ఆమోద బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెడ్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావులకు లీగల్ నోటీసు పంపారు.