పవన్‌కల్యాణ్ అభిమాని నాగేంద్రకు సీఎం జగన్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన రూ.10లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ సాయంతో నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది.