ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కామారెడ్డి జిల్లాలోని సింగీతం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడం వల్ల నీటిని దిగువకు వదులుతున్నారు.