కరోనా పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 9 లక్షల వైరస్ నిర్ధరణ పరీక్షలు చేశారు వైద్యులు. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 3 కోట్లు దాటింది. మరోవైపు అత్యధిక సంఖ్యలో ఒక్కరోజే 57వేల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు.