భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షిణిస్తోంది. తాజాగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫెరల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రణబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.