ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో చిరుత కలకలం రేపుతోంది. తిరుమల, తిరుపతి అటవీ ప్రాంతం సమీపలోని రోడ్లపై ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేస్తోంది. బుధవారం రాత్రి అలిపిరి-చెర్లోపల్లి రహదారిపై వెళ్లే వాహనదారుడిపై దాడికి యత్నించింది.