ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం ప్రాజెక్టుకు అధికంగా నీరు వస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో జలాశయం గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.