శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి 4,29,522 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇప్పటికే జలాశయానికి 3,96,193 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైల జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. గరిష్ఠనీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 206 టీఎంసీలుగా నమోదైంది. 5