ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రస్తుతం దేశం ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ జోస్యం చెప్పారు. దేశంలో ఎన్నో చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలు మూత పడటంతో ఉపాధి సంక్షోభం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల కాలంలో ఇలా ఎన్నడు రాలేదని అన్నారు రాహుల్.