శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో రాత్రి జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. "నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను" అంటూ ప్రకటన చేశారు కిషన్ రెడ్డి.