గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి 11గంటల సమయానికి 52.9అడుగులుగా ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయానికి 54 అడుగులకు పైనే పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.