కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర మాజీ మంత్రి, యునైటెడ్ డెమోక్రెటిక్ అలయన్స్ కన్వీనర్ యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్ని రాజకీయ కార్యకలాపాలు రద్దయ్యాయని తెలిపిన ఆయన.. ఎన్నికల రద్దు కోసం చర్చించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పనికాదని.. ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన సూచించారు.