విజయవాడ రూరల్ నిడమానూరు జాతీయ రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో టైరు పేలిపోవటంతో రహదారీపై పల్టీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగ్రాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయవాడ చెందినవారు.