వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలు బాధాకరమన్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మాట్లాడుతూ.. పండితులు, మత పెద్దలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా అన్ని పండగలను ఇళ్లలోనే చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు.