శ్రీశైలం రిజర్వాయర్ మొత్తం గేట్లను ఎత్తడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ముందుగా నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా... వరద ఉధృతిని బట్టి ఇంకా కొన్ని ఎత్తే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరుకున్నది.నాగార్జున సాగర్ డ్యామ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.