కరోనా వైరస్‌కు కోసం తాను తయారుచేసిన మందును వినియోగించేలా తీర్పు ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన ఆయుర్వేద వైద్యుడు ఓం ప్రకాశ్ వేద్ జ్ఞాన్‌తారా పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడికి రూ.10 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోపు జరిమానా కట్టాలని ఆదేశించింది.