శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.