ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, జగన్‌లు నీటి వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లడం సరికాదన్నారు.