త్రిబుల్ తలాక్ వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టం అమలులో ఉన్నప్పటికీ కొందరు భార్యలకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నారు. ఇటీవలే బెంగళూరుకు చెందిన 42 ఏళ్ల మహిళకు తన భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. బాధిత మహిళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాం సింగ్ చౌహన్ కు ఫిర్యాదు చేసింది. స్పందించిన ముఖ్యమంత్రి న్యాయం చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.