తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న అయనకి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.