శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 30,482 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 886 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1086.6 అడుగులకు చేరింది. మొత్తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను...ప్రస్తుతం 71 టీఎంసీలుగా నమోదు అయ్యింది.