అవినీతి పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి.. నిజాయితీగా పరిపాలించిన ఎన్టీఆర్ను చూస్తే వణుకు పుడుతుందని.. అందుకే ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని టీడీపీనేత నాగరాజు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్న లోకేష్ ను వైసీపీ ఎంత విమర్శించినా.. ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని టీడీపీ నేత నాగరాజు స్పష్టం చేశారు.