తిరుపతి నగరంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై తొండవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో.. ఆటోలో ఉన్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆటోలో ఇరుక్క పోయిన డ్రైవర్ను కాపాడి... ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.