కరోనా లక్షణాలతో మృతిచెందిన కుమారుడి మృతదేహాన్ని ఒంటరిగా శ్మశానానికి తీసుకెళ్లాడు తండ్రి. అయితే ఆసుపత్రిలో మరణిస్తే కనీస రక్షణ చర్యలు చేపట్టలేదు అధికారులు. తండ్రి ఒక్కడే పీపీఈ కిట్లు, గ్లౌజులు లాంటివేమీ ధరించకుండా బల్లపై కుమారుడ్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది.