మహాత్మా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందని అందరికీ తెలుసు. కానీ, ఆయన వాడిన వస్తువులకు సైతం అదే స్థాయి విలువిచ్చే వీరాభిమానులున్నారని ఓ వేలంలో మరోసారి స్పష్టమైంది. అవును, ఆనాడు మహాత్ముడు ధరించిన కళ్లజోడు.. తాజాగా అంతర్జాతీయ వేలంలో 260,000 పౌండ్లకు( దాదాపు రూ.2.55 కోట్లు) అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.