గోదావరి వరద ఉదృతి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోనే ఉంది. 17.90 అడుగులకు నీటి మట్టం చేరగా.. అధికారులు 175 గేట్లు పూర్తిగాఎత్తివేసి.. 19.31 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.