గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీ సెలబ్రిటీలు స్వచ్చందంగా మొక్కలు నాటుతున్నారు. తమ స్నేహితులు, శ్రేయోభిలాషులను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నారు. ఇటీవలే నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్లో మొక్కలు నాటి.. డైరెక్టర్ సందీప్ వంగా, సుధీర్ వర్మ, హరీశ్ పెద్ది, సాహు గారపాటిలను ఈ ఛాలెంజ్లో నామినేట్ చేశారు.