ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చి.. పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ 23 మంది సీనియర్ల బృందం ఏకంగా తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షునితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధ్యక్షుడు ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు.