నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది.16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,70,755 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 3,70,755 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 305.8031 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది.