కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఇకపై ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18 వేలు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అధికారులు.. మెడికల్ షాపులు, పాల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు.