టీడీపీ నేత సుబ్బానాయుడు హౌస్ అరెస్ట్ అయ్యారు. దామవరం ఎయిర్పోర్ట్ భూ సేకరణ అంశంపై అధికార, ప్రతిపక్షం విమర్శలు ప్రతివిమర్శలు తీవ్రతరం అయ్యాయి . ఎయిర్పోర్ట్ భూములపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ సవాల్ చేసిన నేపథ్యంలో.. అర్ధరాత్రి టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బానాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దగదర్తి, దామవరం గ్రామాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. భారీగా మోహరించారు.