వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. మున్నేరు నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2,37,343 క్కూసెక్కులు, ఔట్ ఫ్లో 2,26,500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 10 వేల క్కుసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు.