పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో తాజాగా 417 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసులు 30వేలు దాటాయి. నిన్న కరోనా బారిన పడి మరో 13 మంది మృతి చెందారు. ఏలూరులో అధికంగా 29 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,277కు చేరింది. కొత్తగా 21 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా... 47 చోట్ల ఎత్తివేశారు.