రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిగింది. వంశీచంద్‌రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పిటిషనర్ వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.