కృష్ణా జిల్లాలోని నందిగామ కేడీసీసీ బ్యాంకులో ఉద్యోగి చేతివాటం చూపించాడు. 2018లో అధికారిగా పనిచేసిన వ్యక్తి రుణం ఇచ్చినట్లు చూపించి రూ.19.50 లక్షల సొమ్ము స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఉద్యోగి బదిలీ అనంతరం వ్యవహారం బయటపడింది. దీంతో నిధుల స్వాహాపై బ్యాంక్ అధికారులు విచారణకు ఆదేశించారు