కాంగ్రెస్ నాయకత్వ మార్పు విషయమై చర్చించేందుకు సీడబ్ల్యూసీ భేటీ అయింది. 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి రాసిన లేఖపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండగా లేఖ రాయాల్సిన అవసరమేంటని నాయకులను ప్రశ్నించారు.