దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 76% కి చేరినట్టు ICMR ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే 8 లక్షల 23 వేల శాంపిల్స్ ను పరీక్ష చేసినట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 3 కోట్ల 76 లక్షల శాంపిల్స్ ను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 8.6%గా వుంది.