చిత్తూరు జిల్లా నగరిలో సినీ ఫక్కీలో కంటైనర్లోని సెల్ఫోన్ల దొంగతనం సంచలనంగా మారిపోయింది. తమిళనాడులోని శ్రీ పెరంబుర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ కంటైనర్ను నగరి సమీపంలో లారీతో అడ్డంగించి డ్రైవర్ను చితకబాది అందులోని రూ.6 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోచుకెళ్లారు. మొత్తం 16 బాక్సులు ఉండగా.. 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. లారీలో మొత్తం రూ.12 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.