ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్పై పెట్టిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులిసి రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం అన్నారు. అరెస్ట్ చేసిన రాజధాని రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు.