షకున్ బత్రా దర్శకత్వంలో దీపికా పదుకొణె, అనన్యాపాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చిత్రీకరణ మొదలైన కొన్ని రోజులకే కొవిడ్ ప్రభావంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగి పోయింది. కేంద్రం ఇటీవలే చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వడంతో ఈ సినిమాను వచ్చే నెల్లో తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది చిత్రబృందం. గోవాలో 25 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం.