మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రపిండాల అసమానతలకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు.