సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్థిక ప్రయోజనాలతోపాటు, మీడియా రంగంలో ఆధిపత్యం కోసం సీఎం తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ఆయా సంస్థల పట్ల వారికున్న అనుకూల ధోరణి, బంధుప్రీతి కనపడుతోందని వివరించారాయన.