న్యూఢిల్లీ: యూజీసీ గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిందేనని... ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సూచించింది. సెప్టెంబర్ 30లోపు ఫైనలియర్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని యూజీసీని ఆదేశించింది.