రాజధాని తరలింపు వ్యవహారంలో కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి జనసేన సన్నాహాలు చేస్తోంది. దీనికోసం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు జనసేనాని. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం ఈ విషయంలో జనసేన కలుగజేసుకోకపోవడమే బాగుంటుందని చెబుతోంది. ఓ దశలో పవన్ కల్యాణ్ అమరావతి విషయంలో వెనక్కు తగ్గాలని కాస్త సీరియస్ గానే చెప్పేశారట. కేవలం అమరావతికి సపోర్ట్ చేస్తే, ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యతిరేకులుగా తమపై ముద్రపడుతుందని, ఆ తప్పు ఎప్పటికీ చేయొద్దని తేల్చి చెప్పేశారట. ఈ విషయంపై ఇప్పుడు జనసేన పునరాలోచనలో పడిందని తెలుస్తోంది.