ఆర్ఆర్ఆర్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై అటు నిర్మాతలకి కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఈ దశలో అంతా రాజమౌళి వైపే వేలెత్తి చూపిస్తున్నారు. అసలే సినిమా విషయంలో టెన్షన్లో ఉన్న రాజమౌళి ఇటీవలే కరోనాని జయించారు. సినిమా గురించే ఆలోచిస్తున్నా.. పరిస్థితుల్ని అంచనా వేయడంలో రాజమౌళి ఫెయిలయ్యారు. అందుకే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు.