గత వారం రోజులుగా ఎక్మో పరికరంపై జీవన్మరణ పోరాటం చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం మూడు రోజులనుంచి స్పృహలోకి వచ్చినట్టు ఆయన కొడుకు ఎస్పీ చరణ్ చెప్పారు. సైగలకు స్పందిస్తున్నారని, తనని చూసి గుర్తుపట్టారని, తన చుట్టూ ఉన్నవారని గుర్తించగలుగుతున్నారని కూడా అన్నారు. సాధారణంగా ఎక్మో పరికరం అమర్చిన రోగులు బతికే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే. 50శాతానికి తక్కువమంది బతికి బైటపడుతుంటారు. అలాంటిది ఎక్మోపైకి వెళ్లి కూడా బాలు ఆరోగ్యంతో బైటకొస్తున్నారంటే అది కచ్చితంగా అద్భుతమేనంటున్నారు.