కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ప్రజలంతా లాక్డౌన్ నియమాలను పాటించాలని, మాస్కులు ధరించాలని హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు.