జమ్మూ-కాశ్మీర్ లో మరోసారి కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత బలగాలు. పుల్వామా జిల్లాలో జడోరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో... ఆ ఏరియాలో కుంబింగ్ కు వెళ్లిన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు తెగబడ్డారు. వెంటనే ఆర్మీ కూడా ఎదురుకాల్పులు జరపడంతో... ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. .