నిందితుడు పవన్ కల్యాణ్ అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి సంఘటనల్లో ఆయన పేరు తీసుకురావొద్దని జనసేన పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ ప్రెస్ నోట్ తర్వాత వ్యవహారం మరింత ముదిరింది. ఎక్కడ ఏం జరిగినా బాధితుల పక్షాన బైటకొచ్చే జనసైనికులు ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మిగతా సందర్భాల్లో దళితులపై జరిగిన దాడులపై స్పందించిన టీడీపీ, జనసేన.. ఈ వ్యవహారంలో ఎందుకు న్యాయపోరాటం చేయడంలేదని, కనీసం బాధితుడిని ఎందుకు పరామర్శించలేదని మండిపడుతున్నారు.