అమరావతికోసం చేపట్టిన ఆన్ లైన్ ఓటింగ్ విషయంలో టీడీపీ అతి తెలివి ప్రదర్శిస్తోందని అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో దాదాపు 95శాతం మంది అమరావతికి అనుకూలంగా ఓటు వేస్తే.. కనీసం ఏ ప్రాంతంవారు ఎంత శాతం మద్దతు తెలిపారనే విషయం రాయాలి కదా. ఉత్తరాంధ్ర వాసులు ఎంతమంది అమరావతికి మద్దతు తెలిపారు, రాయలసీమనుంచి ఎంతమంది న్యాయరాజధాని కూడా అమరావతిలోనే ఉండాలని కోరుకున్నారో చెప్పాలి కదా. అవేవీ లేకుండా కాకి లెక్కలు చెబుతూ 95శాతం అంటూ ఓ వార్త ప్రచురించారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇది అంటూ విమర్శిస్తున్నారు.